ఏపీపై చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన మంత్రి కేటీఆర్ !

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఏపీ మంత్రులు కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఏపీలో కరెంట్, నీటి సమస్యలు ఉన్నాయని, రోడ్లు బాగా లేవని మంత్రి కేటీఆర్ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ వ్యాఖ్యలకు వైసీపీ కార్యకర్తల నుంచి.. మంత్రుల వరకు అందరూ కౌంటర్‌ ఇస్తున్నారు.

అటు టీడీపీ పార్టీ నాయకులు, ఎల్లో మీడియా మాత్రం కేటీఆర్‌ కు అండగా నిలిచాయి. అయితే… దీనిపై స్వయంగా మంత్రి కేటీఆర్‌ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గినట్లు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

“ఈ రోజు ఒక మీటింగ్‌లో నేను చేసిన వ్యాఖ్యలు ఏపీలోని నా స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండవచ్చు. నేను AP CM జగన్ గారితో గొప్ప సోదర భావాన్నికలిగి ఉన్నాను. ఆయన నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. నా వ్యాఖ్యలపై ఎలాంటి దురుద్దేశం లేదు.” అంటూ ట్వీట్‌ చేశారు. ఇక ఈ ట్వీట్‌ పై వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news