రాష్ట్రంలో రైతే రాజు అనే నినాదంతో సీఎం కేసీఆర్‌ పథకాలు : మంత్రి మల్లారెడ్డి

-

దేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతు సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమచేస్తూ.. దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. బుధవారం ఘట్‌కేసర్‌ రైతు సేవా సహకార సంఘం సర్వ సభ్య సమావేశం చైర్మన్‌ సింగిరెడ్డి రాంరెడ్డి అధ్యక్షతన నారాయణ గార్డెన్‌లో జరిగింది. ఈ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రైతే రాజు అనే నినాదంతో సీఎం కేసీఆర్‌ రైతుకు సంబంధించి పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

సాగు నీటి కోసం మిషన్‌ కాకతీయ, సాగు పెట్టుబడి కోసం రైతుబంధు, ఉచిత విద్యుత్‌ సరఫరా, ధాన్యం కొనుగోలు, సబ్సిడీ పై విత్తనాల సరఫరా, పంట నష్టం రుణాలు వంటివి అమలు చేస్తూ రైతులను సీఎం ఎప్పటి కప్పడు ఆదుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌ చంద్రారెడ్డి, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ ఎం.పావని‌, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, సంఘం వైస చైర్మన్‌ అనంత రెడ్డి, డైరెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version