చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. గూగుల్ మ్యాప్ లో గుండ్రంగా బొమ్మ గీసేసి ఇదే ఓఆర్ఆర్ అని చూపించిన వ్యక్తి చంద్రబాబు అంటూ చురకలు అంటించారు. ఇన్నర్ లైన్ రోడ్డు వేసిన తర్వాత జగన్ ఔటర్ రింగ్ రోడ్డు ఆలోచన చేస్తారని ఆగ్రహించారు. 2016-17 లో ఓఆర్ఆర్ కట్టాలంటే 8వేల ఎకరాలు అవసరం అని నివేదిక ఇచ్చారని.. దీని కి 17 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేసి కేంద్ర సహాయం అప్పట్లో చంద్రబాబు అడిగారన్నారు.
భూ సేకరణ చేసి ఇస్తే చూస్తామని కేంద్రం చెప్పిందని.. కేంద్రం అడిగినా 2018 వరకు కనీసం డీపీఆర్ కూడా ఇవ్వలేక పోయారని చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. ఇప్పుడు మా మీద ఆరోపణలు చేయటం ఏంటో విపక్షాలకే తెలియాలన్నారు. చిన ఔట్ పల్లి నుంచి కాజా టోల్ గేట్ వరకు దుర్గా గుడి ఫ్లై ఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా ఐదేళ్ళ కాలంలోనూ చంద్రబాబు కట్టించలేక పోయారని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. జగన్ రెండున్నరేళ్ల లోనే బెంజ్ సర్కిల్ రెండో ఫ్లై ఓవర్ కు అనుమతి సంపాదించి నిర్మాణం కూడా పూర్తి చేశారని గుర్తు చేశారు.