రేషన్ కార్డు దారులకు మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త చెప్పారు. రేషన్‌కార్డు దారులకు సన్నబియ్యం ఇస్తామని ప్రకటించారు.అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అన్ని రంగాలను ఆదుకునే ప్రయత్నం చేశామని, బీఆర్ఎస్ నేతలు తెలంగాణను పదేళ్లు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి గెలిచినా తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు.‘ఫాక్స్‌కాన్’ పెట్టుబడుల అంశంలో కేటీఆర్ విమర్శలన్నీ సత్యదూరమైనవని ఎద్దేవాచేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ ఇంకా టాప్‌లోనే ఉందని వివరించారు.
బీజేపీ, బీఆర్ఎస్ కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. ప్రతిపక్షాల ఆలోచనలో మార్పు రావాలని సూచించారు.హైడ్రాతో అందరూ భయపడాల్సిన అవసరం లేదని..కేవలం అక్రమార్కులకే భయమని తెలిపారు. పేదలు మురికి కూపాల్లోనే ఉండాలని బీఆర్ఎస్, బీజేపీ నేతల ప్లాన్ అని ఘాటు విమర్శలు చేశారు. అసలు మూసీ ప్రాజెక్టుకు, రాబర్ట్‌వాద్రాకు ఏంటి సంబంధం ఏంటని ప్రశ్నించారు. చిన్నాభిన్నమైన తెలంగాణ ఆర్థికవ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం గాడీనపెడుతున్నదని చెప్పారు.