టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ప్రలోభాలపై ఆయన స్పందిస్తూ.. చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని.. ఎమ్మెల్యేల కొనుగోళ్లలో ఆయన తీరులో మార్పు లేదని ఆరోపించారు. సాధారణ ఎన్నికలలో గెలుపు వైసిపి దేనిని అన్నారు. జగన్ ను వన్స్ మోర్ సిఎం గా ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయ్యారని ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే శ్రీదేవికి నాలుగు ఏళ్ల తర్వాత ఇప్పుడు కులం గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఇక రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ చేయాలని తనకు ఆఫర్ వచ్చిందని.. టిడిపి నుంచి 10 కోట్లు ఆఫర్ చేశారని వెల్లడించారు. కానీ ఆ ఆఫర్ ని తిరస్కరించాలని చెప్పారు రాపాక.