వంద మంది పోలీసులు చేయగల పనిని ఒక్క సీసీ కెమెరా చేస్తుంది : మంత్రి తలసాని

-

శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమైనదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పోలీసు అధికారులతో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తెలంగాణా సచివాలయంలోని తన చాంబర్ లో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి కోటి 50 లక్షల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

వంద మంది పోలీసులు చేయగల పనిని ఒక్క సీసీ కెమెరా చేస్తుందని అన్నారు. దేశంలోనే అత్యధిక కెమెరాలను ఏర్పాటు చేసిన నగరంగా హైదరాబాద్‌ కు గుర్తింపు ఉన్నదని పేర్కొన్నారు. నగరంలోనే అత్యధిక సీసీ కెమెరాలను సనత్‌నగర్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాల్లో నూటికి నూరు శాతం సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాల పనితీరును కూడా తరచూ పర్యవేక్షిస్తుండాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కమిషనర్‌ గజారావు భూపాల్‌, ఐటీ విభాగం ఏసీపీ చాంద్‌ పాషా, ఇన్‌స్పెక్టర్‌ విశాల్‌, ఉత్తర మండలం డీసీపీ చందనదీప్తి, ఏసీపీలు పాల్గొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version