చంద్రబాబు నాయుడుపై మరోసారి ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే ఆర్. కె రోజా. చంద్రబాబు నాయుడు ప్రస్టేషలో వున్నాడని.. జగన్ చూసి ఓర్వలేక పోతున్నాడని నిప్పులు చెరిగారు. నిన్న పండగ పూట ఎన్నికలేంటి అని అంటున్నాడని… ముఖ్యమంత్రి జగన్ కు ఎన్నికల కమిషన్ కు సంబంధం ఏమిటి ? అని ప్రశ్నించారు.
నిమ్మగడ్డ ఎలెక్షన్ కమిషనర్ ఉన్నపుడు అన్ని నచ్చాయని… ఇప్పుడు ఉన్న ఎలెక్షన్ కమిషనర్ ను తప్పులు పడుతున్నారని చురకలు అంటించారు రోజా. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేసాడని ఫైర్ అయ్యారు. ఇప్పుడు జగనన్న పరిపాలన చూసి… ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల సంక్షేమాన్ని చూసి చంద్రబాబు నాయుడు ఒరవలేక పోతున్నాడని… ఏ ఎలెక్షన్ ఎప్పుడూ వచ్చినా వైసిపి కె ప్రజలు పట్టకడుతున్నారని స్పష్టం చేశారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు బాధ్యత గల ప్రతిపక్షంగా ఉంటే మంచిదన్నారు రోజా.