తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది . ఆదిలాబాద్, వరంగల్, మెదక్ నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం లో ఉన్న ఒక్కొక్క సిటు,మహబూబ్ నగర్,రంగారెడ్డి జిల్లా రెండు స్థానాలకు ఎన్నిక జరుగుతుందని ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం ఖాళీగా ఉందని తెలిపారు. కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ ఉన్నాయని ఇవాళ నోటిఫికేషన్ చేశారు.
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ నవంబర్ 23 కాగా, నవంబర్ 24 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 26 ఉపసంహరణకు చివరి తేదీగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. సెంబర్ 10 న ఎన్నికలు జరుగుతాయని, డిసెంబర్ 14 కౌంటింగ్ ఉంటుందని తెలిపింది. పోలింగ్ సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని పేర్కొంది. కరోనా నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఈసీఐ ఇచ్చిన కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది ఎన్నికల సంఘం.