టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీలో మంత్రి కేటీఆర్‌ను విచారించాల్సిందే : ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

-

TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ ను కూడా విచారించాల్సిందేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. స్థానిక ఇందిరా భవన్ లో మీడియాతో మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ లో సిట్ నిష్పక్షపాతంగా విచారణ చేపడుతోందని ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు మంత్రి కేటీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి ద్వారానే టీ.ఎస్.పీ.ఎస్.సీ తాటిపల్లికి చెందిన రాజశేఖర్ రెడ్డి ఉద్యోగం పొందాడని తెలిపారు. మంత్రి కేటీఆర్ ఇటీవల సిరిసిల్లలో మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో గ్రూప్-1 లో వందకు పైగా మార్కులు ఒక్కరికీ మాత్రమే వచ్చాయని అన్నారని కానీ, సిట్ విచారణలో 30 మందికి పైగా వచ్చాయని ప్రచారం జరుగుతోందని ఆయన తెలిపారు.

TPCC President: Telangana Congress Leader Jeevan Reddy Responds Over  Speculations On Becoming TPCC Chief

ఈ విషయంలో మంత్రి కేటీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీ.ఎస్.పీ.ఎస్.సీ ప్రశ్నాపత్రాల లీకేజీతో 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుంటే నిష్పక్షపాతంగా వాస్తవాలను వెలికి తీసేలా ప్రశ్నిస్తే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యమేమిటన్నారు. నేడు నేను ప్రశ్నిస్తే రేపు నాకు కూడా నోటీసులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. టీ.ఎస్.పీ.ఎస్.సీలో ఆంధ్ర ఉద్యోగి డిప్యూటేషన్ మీద ఎలా వచ్చారని అసలు టీ.ఎస్.పీ.ఎస్.సీ సభ్యుల నియామకమే రాజకీయ నియామాకమని విమర్శించారు. పదో తరగతి పేపర్ లీకేజీ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదన్నారు. ఈ పరిణామం ప్రశ్నించే వారిని అనగదోక్కడమేనని, అసలు పది ప్రశ్నాపత్రాల లీకేజీలో బండి సంజయ్ కి సంబంధం ఉందా లేదా అనే విషయం సాక్ష్యాధారలతో సహా ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news