హైదరాబాద్ నగరవాసులకు అలెర్ట్. ఇవాళ నగరంలో ఎంఎంటీఎస్ రైలు సర్వీసుల రద్దు కొనసాగుతోంది. వారం రోజులుగా సర్వీసులను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలు జారీ చేస్తూనే ఉంది. గతంలో శని, ఆదివారాల్లో రద్దు చేస్తే.. ఇప్పుడు పనిదినాల్లో కూడా రద్దు చేస్తూ, నగర ప్రయాణికులకు తక్కువ టిక్కెట్ ధరతో ఎక్కువ దూరం ప్రయాణించే వెసులుబాటును దూరం చేస్తోంది. సోమవారం 19 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది.
వాటి వివరాలివీ..
• లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లేవి
• హైదరాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లేవి 3
• ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లేవి 5
• లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లేవి 6
• రామచంద్రాపురం – ఫలక్‌నుమా మధ్య 2
• ఫలక్‌నుమా నుంచి హైదరాబాద్ వెళ్లేది 1