బ్యాంక్ కీలక నిర్ణయం.. మొబైల్ ఫోన్ కొనడానికి రెండు లక్షల రూపాయిలు..!

-

తాజాగా ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. తన టాప్ మేనేజ్‌మెంట్‌కి మొబైల్ ఫోన్లు కొనేందుకు అలవెన్స్‌ ని ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వార్షికంగా రూ.2 లక్షల అలవెన్స్‌ ఇవ్వాలని నిర్ణయించింది. రూల్స్ ని బ్యాంక్ మార్చగా.. మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మొబైల్ ఫోన్లు ని కనుక కొనుగోలు చేస్తే సంవత్సరానికి రూ.2 లక్షలను బ్యాంకు ఇవ్వనుంది.

పూర్తి వివరాలను చూస్తే.. మొబైల్ ఫోన్ ఖర్చులలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ ని ఇంక్లూడ్ చెయ్యలేదు. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు మొబైల్ ఫోన్లపై 18 శాతం జీఎస్టీ వుంది. ఏప్రిల్ 1, 2022 నుంచే బ్యాంకు బోర్డు నిర్ణయం తో మార్చిన రూల్స్ వచ్చాయి.

దేశం లోనే రెండవ అతి పెద్ద బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. బోర్డు ఆమోదించిన సమీక్షించిన మార్గదర్శకాల కింద చూస్తే చీఫ్ జనరల్ మేనేజర్‌కి మొబైల్ ఫోన్ అలవెన్స్ రూ.50 వేలు గా వుంది. జనరల్ మేనేజర్‌కి అలవెన్స్ అయితే రూ.40 వేలుగా వుంది.

ఇక కార్లకి సంబంధించి వివరాలను చూస్తే చీఫ్ జనరల్ మేనేజర్‌కి కారు ప్రయోజనాలను కూడా సమీక్షించారు. ప్రస్తుత ఎక్స్‌షోరూం ధర రూ.12 లక్షల నుండి రూ.15.50 లక్షలకు మార్చారు. అది కూడా జీఎస్టీ మినహాయించి. జనరల్ మేనేజర్ స్థాయి వారికైతే రూ.9 లక్షల కి బదులు రూ.11.50 లక్షల కి లిమిట్ ని పెంచారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version