టీ20 వరల్డ్ కప్‌ నుండి మహ్మద్ షమీ ఔట్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ప్రారంభం కాక ముందే టీమిండియా స్టార్ పేసర్‌ మహ్మద్‌ షమీ ఐపీఎల్ కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో గుజరాత్‌ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్పు లో చివరి మ్యాచ్ ఆడిన షమీ అప్పటినుంచి ఆటకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహమ్మద్ షమీ జూన్ లో జరగబోయే పొట్టి ఫార్మాట్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది .

ఎడమ చీలమండ గాయంతో షమీ పునరాగమనం మరింత ఆలస్యం కానుంది. జనవరి చివరి వారంలో లండన్‌ కి వెళ్లి చీలమండకు ప్రత్యేకమైన ఇంజెక్షన్‌ తీసుకున్నా షమీ మూడు వారాల తర్వాత లైట్‌గా రన్నింగ్‌ మొదలుపెట్టాడు. కానీ ఇంజెక్షన్‌ పని చేయలేదు.ఫిబ్రవరిలో లండన్‌లో చీలమండ శస్త్రచికిత్స చేయించుకున్న షమీ… కోలుకోవడానికి ఎక్కువ సమయం అవసరమని వైద్యులు తెలిపారు.తాజాగా షమీ పునరాగమనంపై ధర్మశాలలో మీడియాతో మాట్లాడిన బీసీసీఐ సెక్రటరీ జైషా.. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే హోమ్ సిరీస్‌కు షమీ అందుబాటులో వచ్చే అవకాశముందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version