బీజేపీకి బిగ్ షాక్.. మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా

-

హైదరాబాద్: బీజేపీకి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా చేశారు. ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ దళిత అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆ సమయంలో మోత్కుపల్లిపై బీజేపీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన అప్పటి నుంచి బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీ కార్యక్రమాలకు కూడా మోత్కుపల్లిని బీజేపీ నాయకులు ఆహ్వానించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి బీజేపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌తో పాటు బీజేపీ కేంద్ర అధిష్టానానికి కూడా పంపినట్లు సమాచారం.

కాగా మోత్కుపల్లి తెలుగుదేశం పార్టీలో చాలా కాలం పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా టీడీపీలోనే కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలతో ఆయన బీజేపీలో చేరారు. తాజాగా ఆయన రాజీనామా చేయడంతో మోత్కుపల్లి టీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం వల్ల కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కూడా ఉన్నాయని అని విశ్లేషకులు అంటున్నారు. మరి మోత్కుపల్లి రాజీనామా విషయంతో పాటు ఏ పార్టీలో చేరబోతున్నారనే దానిపై ఆయన మీడియా ముందుకు వచ్చి స్పష్టత ఇస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version