మోటో ఈ22ఎస్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఈ నెల 17న లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీయో అధికారికంగా వెల్లడించింది. మోటో ఈ-సిరీస్‌లో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే అవడం విశేషం. ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా కంపెనీ రివీల్ చేసింది.. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోనే.. ఇంకా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మోటో ఈ22ఎస్ ధర..
యూరోప్‌లో ఈ ఫోన్ ధర 159.99 యూరోలుగా అంటే సుమారు రూ.12,700 గా ఉంది. మనదేశంలో రూ.10 వేలలోపు ధరతోనే ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
మోటో ఈ22ఎస్ స్పెసిఫికేషన్లు (అంచనా)..
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్ కూడా ఉంది. 4 జీబీ ర్యామ్ ఆప్షన్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది.
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే ఆప్షన్ ఉంది.
ఈ ఫోన్‌లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లేను అందించనున్నారు.
కెమెరా క్వాలిటీ..
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. మోటో ఈ32ఎస్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
దీని ముందు వెర్షన్ కూడా రూ.10 వేలలోపు ధరతోనే లాంచ్ అయింది. మోటో ఈ-సిరీస్ ఫోన్లకు మనదేశంలో మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఈ ఫోన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఫోన్ లాంచ్ అయితే తెలియదు..రేసులో నిలబడగలదా లేదా అని.. అసలే ఇండియాలో బడ్టెట్ ఫోన్లకు గట్టి కాంపిటీషన్ ఉంది.!