నోరు తడారిపోతుందా.. కారణాలు ఇవే కావొచ్చు.. ఇలా నివారిద్దాం..!

-

కొంతమందికి విపరీతంగా నోరు ఎండిపోతుంది. తడి ఆరినట్లు అనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు సరిగ్గా ఏది తినాలనిపించదు. చికాకుగా ఉంటుంది. ఏదో తెలియని జబ్బు పట్టిపీడించినట్లు అనిపిస్తుంది కదా..ఇది కంగారపడేంత పెద్ద విషయం కాదు.. లైట్ తీసుకునేంత చిన్న విషయూ కాదు. ఈరోజు మనం ఈ సమస్యకు గల ప్రధాన కారణాలు, నివారణ మార్గాలు చూద్దాం.

నోరు తడి ఆరిపోవడానికి కారణాలు..

బాడీలో నీటిశాతం తగ్గడం. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు..లాలజలం తగ్గుతుంది. దానివల్ల నోరు ఎండిపోతున్న ఫీలింగ్ వస్తుంది.
మానసిక ఒత్తిడి, భయం, టెన్షన్ పెరిగినప్పుడు కూడా లాలాజల గ్రంథులు లాలాజలం స్రవిచండం తగ్గిస్తాయి. దానివల్ల కూడా నోరు ఎండిపోతుంది.
టీ/కాఫీలు తాగేవారికి వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నిదానంగా లాలాజలం తగ్గడం జరుగుతుంది.
లాలాజల గ్రంథులకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా నోరు తడి ఆరిపోతుంది.
కీమో థెరఫీ రెడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా మౌత్ డ్రైనెస్ అవుతుంది.

లాలాజలం లేకపోతే జరిగే నష్టాలు..

లాలజం నోట్లో చెడ్డ బాక్టీరియా పెరగకుండా చేస్తుంది. ఎవరిలో అయితే లాలాజలం తక్కువగా ఉంటుందో.. వారి నోరు దుర్వాస వస్తుంది. లాలజలం ఉంటేనే.. టేస్ట్ తెలుస్తుంది.. మరి లాలాజలం తక్కువగా ఉన్నవారికి టేస్ట్ తెలియక ఏది తినాలనిపించదు.. లాలాజలం అనేది జీర్ణాది రసం.. ఇది లేకపోతే.. డైజెషన్ కూడా జరగదు. నోరు పొడి ఆరిపోతుంటే.. మాట్లాడటం కూడా కష్టమే.. పళ్లు కూడా దెబ్బతింటాయి.
మనం నిజానికి 70శాతం వాటర్ కు ప్రాధాన్యం ఇవ్వాలి.. 30 శాతం తినే పదార్థాలకు ఇవ్వాలి. కానీ చాలామంది ఇది ఉల్టా ఫాలో అవుతారు. తిండి ఎక్కువగా తింటారు.. వాటర్ తక్కువగా తాగుతారు. నీరు బాడీకి సరిపడా తాగితే.. మెడిసెన్స్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

లాలాజలం ఉత్పత్తి చేయాలంటే ఏం చేయాలి..

పెద్ద ఉసిరికాయ ముక్కలు నోట్లో పెట్టి చప్పరిస్తే చాలు.. లాలాజలం స్రవిస్తుంది. ఇవి సంవత్సరం పొడవునా దొరకవు కాబట్టి.. ఉసిరికాయలు ఎండపెట్టుకుని ఇంట్లో ఉంచుకుని ఈ సమస్య వచ్చినప్పుడు తీసుకోవచ్చు. పచ్చిమామిడికాయ, నిమ్మ చెక్క ఇవన్నీ కూడా ఇన్ స్టెంట్ గా నోట్లో లాలజలం స్రవించేలాచేస్తాయి.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news