పంటలకు బీమా లేదుగానీ.. రైతు బీమా ఇస్తాడంట : ఎంపీ అర్వింద్‌

-

మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ విమర్శలు గుప్పించారు. గురువారం.. జగిత్యాలలోని కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో జరుగుతున్న బహిరంగసభలో ఎంపీ అర్వింద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే.. రాష్ట్రంలో సమస్యలు తీరుతాయని ధర్మపురి అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి చూస్తే సీఎం కేసీఆరా లేక కేటీఆరా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు అర్వింద్. హాజరైన ఆయన కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు అర్వింద్. ముఖ్యమంత్రి అసంబద్ధ నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో ప్రతి వర్గం ఇబ్బందులు ఎదుర్కొంటోందని అర్వింద్ విమర్శించారు.

Nizamabad MP Dharmapuri Aravind detained while on his way to Bhainsa

రాష్ట్రాన్ని ఆయుష్మాన్ భారత్ పథకంలో చేర్చకపోవడం వల్ల కోవిడ్ సమయంలో అనేక మంది చనిపోయారని మండిపడ్డారు. పంటల బీమా లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నా పరిహారం ఇవ్వని కేసీఆర్.. రైతు చనిపోతే మాత్రం బీమా ఇస్తానని చెబుతున్నాడని అన్నారు. సమస్యల్ని  పక్కదారి పట్టించేందుకు ప్రతిదానికి రైతు బంధు బూచి చూపిస్తున్నాడని చెప్పారు. ఏ కాలుకు దెబ్బ తగిలిందో తెలియక కేటీఆర్ ఏదో ఒక కాలికి పట్టి వేయించుకున్నాడని చురకలంటించారు అర్వింద్.

 

Read more RELATED
Recommended to you

Latest news