జేపీ నడ్డాతో నితిన్‌, మిథాలి భేటీపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ లక్ష్మణ్‌

-

తెలంగాణలో రాజకీయం రోజు రోజుకూ వేడెక్కుతోంది. బీజేపీ దృష్టి ఇప్పుడు తెలంగాణపై పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా బీజేపీ జాతీయ రాజకీయం తెలంగాణ చుట్టూ తిరిగుతోంది. అయితే నిన్న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో టాలీవుడ్ యువ హీరో నితిన్ స‌మావేశమయ్యారు. బండి సంజ‌య్ పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా వ‌రంగ‌ల్‌లో బీజేపీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ అనంత‌రం హైద‌రాబాద్ వ‌చ్చిన జేపీ న‌డ్డా… శంషాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్‌లో బ‌స చేయ‌గా.. బీజేపీ ఆహ్వానం మేర‌కు హోట‌ల్‌కు వెళ్లిన నితిన్… న‌డ్డాతో స‌మావేశ‌మయ్యారు.

- Advertisement -

JP Nadda to meet Nithin and Mithali Raj: తెలంగాణ పర్యటనకు జేపీ నడ్డా.. హీరో  నితిన్‌, క్రికెటర్‌ మిథాలీరాజ్‌తో భేటీ..! - NTV Telugu

దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో న‌డ్డా, నితిన్‌ల‌తో పాటు బీజేపీ ఎంపీ ల‌క్ష్మ‌ణ్‌, మాజీ ఎమ్మెల్సీ రాంచంద‌ర్ రావులు పాల్గొన్నారు. న‌డ్డాతో భేటీ ముగించుకుని నితిన్ వెళ్లిపోయిన త‌ర్వాత ల‌క్ష్మ‌ణ్ మీడియాతో మాట్లాడారు. నితిన్‌తో పాటు శ‌నివారం మ‌ధ్యాహ్నం జేపీ న‌డ్డాతో భేటీ అయిన మాజీ క్రికెట‌ర్ మిథాలీ రాజ్ బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌డానికి సానుకూలత వ్య‌క్తం చేశార‌ని ఆయ‌న చెప్పారు. ఈ దిశ‌గా జేపీ న‌డ్డా చేసిన ప్ర‌తిపాద‌న‌కు వారిద్ద‌రూ అంగీక‌రించార‌న్నారు. ప్ర‌ధాని మోదీ కోసం అవ‌స‌ర‌మైతే బీజేపీ త‌ర‌ఫున ప‌ని చేయ‌డానికి త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని వారు చెప్పిన‌ట్లు ల‌క్ష్మ‌ణ్ తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...