వయోభారంతో పొంతన లేకుండా మాట్లాడుతున్నాడో అర్థం కాదు :విజయసాయిరెడ్డి

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. పెగ్గు రాజుతో స్నేహం తర్వాత మా బాబన్న రెండు పెగ్గులు వేస్తున్నాడో తెలియదు – వయోభారంతో పొంతన లేకుండా మాట్లాడుతున్నాడో అర్థం కాదు. మా చంద్రం అన్న మాటలు వింటుంటే బాధ – జాలి రెండూ కలుగుతున్నాయి అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. అంతకుముందు.. గత కొన్నిరోజులుగా కుప్పంలో జరుగుతున్న ఘటనలపై స్పందించిన విజయసాయిరెడ్డి.. ఇక ఇదే సమయంలో చంద్రబాబుకు కేంద్రం భద్రత పెంచిన విషయంపైనా ఆయన సెటైర్లు వేశారు. టీడీపీ అధినేతకు 24 మంది ఎన్ఎస్‌జీ కమాండోలతో భద్రత కల్పిస్తున్నారని.. అంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకున్న 23 మంది ఎమ్మెల్యేల కంటే చంద్రబాబు భద్రతా సిబ్బందే ఎక్కువంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే నిజానికి చంద్రబాబుకు కుప్పం ప్రజల నుంచే ముప్పు పొంచి వుందని అన్నారు విజయసాయిరెడ్డి.

ఎన్నికల హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని .. అందుకే అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో వున్నారని దుయ్యబట్టారు విజయసాయిరెడ్డి. రెండ్రోజుల క్రితం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ… 33 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. కుప్పం తన చేతి నుండి జారిపోతుందని చంద్రబాబుకి భయం కలిగిందని రాంబాబు దుయ్యబట్టారు. భయంతోనే ఎప్పుడూ లేని విధంగా తరచూ కుప్పంకి వెళ్తున్నారని, చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి గాలేరు నగరి ఎందుకు పూర్తి చెయ్యలేదని అంబటి నిలదీశారు. అధికారంలో ఉండగా పట్టించుకోకుండా ఇప్పుడు ఊరూరా తిరుగుతున్నారని… కుప్పంపై చంద్రబాబుకి ప్రేమ లేదని, రాజకీయ అవసరం మాత్రమేనని ఆయన ఆరోపించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version