యూ ట్యూబ్ లో రికార్డ్ సృష్టించిన మిస్టర్ బీస్ట్… ఎంతమంది సబ్స్క్రైబర్స్ అంటే..?

-

అమెరికన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డొనాల్డ్సన్) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతడు యూట్యూబ్లో చేసే వీడియోలకు ఏ రేంజ్ లో వ్యూస్ ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా మిస్టర్ బీస్ట్ అరుదైన ఘనత సాధించారు. 267M సబ్కైబర్లతో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లున్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. T-సిరీస్ 266M సబ్కైబర్లతో 2వ స్థానంలో ఉంది. 2012లో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన మిస్టర్ బీస్ట్ వినూత్న వీడియోలు చేస్తూ ఆదరణ పొందారు. అతడి వీడియోలను కోట్లాది మంది వీక్షిస్తుండటంతో యూట్యూబ్ ద్వారా రూ.వేల కోట్లు సంపాదిస్తున్నారు.

మిస్టర్ బీస్ట్ ఒక అమెరికన్ యూట్యూబర్ , ఆన్‌లైన్ వ్యక్తిత్వం, వ్యవస్థాపకుడు మరియు పరోపకారి. అతను తన వేగవంతమైన మరియు అధిక-ప్రొడక్షన్ వీడియోలకు ప్రసిద్ధి చెందాడు, ఇందులో విస్తృతమైన సవాళ్లు మరియు భారీ బహుమతులు ఉంటాయి

Read more RELATED
Recommended to you

Exit mobile version