ఫస్టు సినిమాతోనే స్టార్ డమ్ కేటగిరిలో మృణాల్ ఠాకూర్

-

చాలా మంది కథానాయికలకు స్టార్ డమ్ రావడానికి ఎంత సమయం పడుతుందో తెలిసిందే. కానీ కొంతమందికి మాత్రం ఫస్టు సినిమాతోనేపెద్ద స్టార్ డమ్ వచేస్తుంది. మృణాల్ ఠాకూర్ మనకు రెండో కేటగిరిలోనే కనిపిస్తుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో మొదటి సినిమాగా ఆమె చేసిన ‘సీతా రామం’ ఎంత పేరు తెచ్చి పెట్టిందో మనకి తెలిసిందే. వేరే భాషల్లోను ఆమెకి మంచి పేరు తెచ్చి పెట్టింది. అలాంటి మృణాళ్ ఠాకూర్ తాజాగా ఓ స్టేజ్ పై మాట్లాడుతూ .. “మాది మరాఠీ ఫ్యామిలీ .. నేను యాక్టింగ్ వైపు రావడం మా పేరెంట్స్ కి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే అటు టీవీ అయినా .. ఇటు సినిమా అయినా అసలు ఈ ఇండస్ట్రీ గురించి వారికి పెద్దగా తెలియకపోవడమే అందుకు కారణం.

అందువల్లనే వారు నన్ను సపోర్ట్ చేయలేకపోయారు” అని ఆమె తెలిపారు.” నేను టీవీ సీరియల్స్ లో నటిస్తూ వెళ్లాను. అక్కడ వచ్చిన గుర్తింపు నన్ను సినిమాల వైపు తీసుకుని వెళ్లింది. నేను ఎంచుకున్న కథలు .. పాత్రలు నాకు మంచి పేరును తీసుకుని వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది నన్ను స్మితా పాటిల్ తో పోల్చుతున్నారు. నిజంగా నేను గర్వించదగిన విషయమే ఇది. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా నా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు” అని వ్యక్తపరిచారు ఆమె.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version