పవన్ కల్యాణ్ పై గణ రాసిన ‘ద రియల్ యోగి’ అనే పుస్తకాన్ని నాగబాబు ఇవాళ ఆవిష్కరించారు. హైదరాబాదులోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణి, దర్శకుడు బాబీ, ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. కళ్యాణ్ గురించి ఏం చెప్పిన సొంత తమ్ముడు అనుకుంటారు, ఒక కామన్ మెన్ పోయిట్ లో రాసాడు, నేను దేవుణ్ణి నమ్మను, కానీ నమ్మే వాళ్ళను రెస్పెక్ట్ ఇస్తాను, పవన్ లాగా నేను ఒక రోజు అయిన ఉండగలనా? కామ, క్రోధ లను అదుపులో పెట్టుకుంటే ఉన్నత స్థాయిలో కి వెళ్తారు, ఒక మనిషి ఎలా బ్రతకాలి అనేదానిపై పవన్ కళ్యాణ్ చాలా మంచి స్పీచ్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ మోస్ట్ కంపర్టీబుల్ పవన్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడంటే చిన్నప్పుడు నుండి ఒంటరిగా ఉండేవాడు.
10th క్లాస్ పాస్ అయ్యాక తను ఏంటో అర్ధం అయింది. చిరంజీవి గారి తమ్ముడు అయినంత మాత్రాన సినిమా లు ఎవరు ఇవ్వరు. ఒక మనిషి గా పుట్టాక పెరిగాం, జీవించం, చనిపోయామ అని కాకుండా ఒక లక్ష్యం ఉండాలని కోరుకున్నాడు. రాజకీయాల్లోకి రావడానికి టిడిపి లోనో, బీజేపీ లోనో చేరితే ఏదో మంత్రి పదవి వచ్చేది, కానీ స్వాతంత్ర గా పార్టీ పెట్టుకొని, లంచగొండి, అవినీతి పరులను నిలదీయటానికి పార్టీ పెట్టాడు. తనకు వున్నా ఎమౌంట్ మొత్తం పిల్లల పై ఫిక్సడు డిపాజిట్ చేసి జనసేన పార్టీ పెట్టాడు, నేను విలువల తో బ్రతకాలి అనుకున్న అన్నాడు పవన్ కళ్యాణ్. రాజకీయ నాయకుడు అయితే కోట్ల మందికి సహాయం చేయగలుగుతాడు, ప్రజల కోసం పని చేయాలి, వాళ్లకు సర్వీస్ చేయడానికి వచ్చాడు, పవన్ కళ్యాణ్ మా ఇంట్లో పుట్టాడు అదే బయట పుడితే ఇంకా ఎంత మాట్లాడేవాడినో’ అని ఆయన వ్యాఖ్యానించారు.