మా బిల్డింగ్ పై సినీ నటుల మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతోంది. ఇక తాజాగా ఈ విషయంపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మా సభ్యుల జూమ్ మీటింగ్ లో మా బిల్డింగ్ అమ్మకంపై మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలకు ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు నాగబాబు. మా బిల్డింగ్ ఎందుకు అమ్మారని నరేష్ ను మోహన్ బాబు అడగాలని సూచనలు చేశారు నాగబాబు.
బిల్డింగ్ అమ్మకంపై తాను కూడా నరేష్ నే అడుగుతానని నాగబాబు పేర్కొన్నారు. శివాజీ రాజా మరియు నరేష్ ఎస్టిమేషన్ వేసి.. అమ్మారని తెలిపారు. రూ. 95 లక్షల బిల్డింగ్ ను కేవలం రూ. 30 లక్షలకే అమ్మేశారని మండిపడ్డారు. ఇక అంతకు ముందు… మోహన్ బాబు కూడా బిల్డింగ్ అమ్మకం పై అసోషియేషన్ పై మండిపడ్డారు. సగం ధరకే బిల్డింగ్ అమ్మడమేంటని ప్రశ్నించారు. ఈ నేపథ్యం లోనే నాగబాబు పేరును ప్రస్తావించారు మోహన్ బాబు. అయితే… దీనికి కౌంటర్ గానే… ఇవాళ నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.