హీరో పేరు మారిస్తే కెరియర్ సూపర్ హిట్టే..!

-

సినిమా రంగంలోకి మొట్టమొదటిగా అడుగుపెట్టే  హీరో , హీరోయిన్స్ పేర్లు అందరూ పలికేలా వుండాలని, మోడ్రన్ గా వుండాలని పేర్లు మార్చుకుంటారు.. అలాగే కొంత మంది వారి నమ్మకాల  ప్రకారం కూడా కొన్ని మార్పులు చేస్తూ వుంటారు. చాలా మందికి  ఈపేర్ల వల్ల కెరియర్లో చాలా మందికి విజయాలు వచ్చాయి. మన మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఇలాగే జరిగింది. తన మొదటి పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్, కాని తన పేరును చిరంజీవిగా మార్చుకున్నారు. తెలుగు సినిమా లో నంబర్ వన్ గా ఎదిగారు.చిరంజీవి లాగానే చాలామంది హీరోలు పేర్లు మార్చుకున్నారు. వారి వివరాలు తెలుసుకుందాం.

కేజీఫ్ చిత్రాలతో అదర గొట్టిన యష్ అసలుపేరు నవీన్ కుమార్ గౌడ”. తనకి ఈ పేరు కూడా గుర్తులేదు. అలాగే హీరో  నాని అసలు పేరు గంట నవీన్ బాబు. ఇప్పుడు అందరూ నేచురల్ స్టార్ నానిగా పిలుచుకుంటున్నాము. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ అసలుపేరు “వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి” ఈ విషయం చాలా మందికి తెలియదు. అందరికి ప్రభాస్ గానే తెలుసు.అలాగే కోలీవుడ్లో స్టార్ హీరో అయిన ధనుష్ తన పాత  పేరు వెంకటేశ్ ప్రభు కస్తూరిరాజా.

మరో  తమిళ నటుడు విక్రమ్ అసలు పేరు కెన్నెడీ జాన్ విక్టర్, మనకు విక్రమ్ గానే తెలుసు.అలాగే మాస్ మహారాజా రవితేజ అసలుపేరు రవిశంకర్ రాజు భూపతి రాజు, మనకు మాస్ మహరాజ్ రవితేజ గానే తెలుసు . అలాగే మనకు ఎంతో ఇష్టమైన తమిళ నటుడు సూర్య అసలుపేరు శరవనన్ శివకుమార్. కామెడి హీరొ సంపూ అని ముద్దుగా పిలుచుకొనే సంపూర్ణేష్ బాబు అసలుపేరు నరసింహచారి. ఇలా చాలా మంది తమ పాత పేర్లు తీసేసి కొత్త పేర్లు పెట్టుకొని అనేక హిట్స్ కొట్టారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version