చడీ చప్పుడు లేని నాని! ఫ్యాన్స్ ఆగ్రహం.!

-

నేచురల్ స్టార్ నాని  హీరోగా నటిస్తున్న దసరా అనే సినిమా నిర్మాణంలో ఉంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి నెలలో రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా తో కచ్చితంగా హిట్ కొట్టాలని చాలా కష్టపడుతున్నాడు. తాను ఆశించినట్లు ఈమూవీ బిజినెస్ నాని కెరియర్ లోనే అత్యధికంగా జరిగిందనే ప్రచారం వుంది.

ఇక హిట్ కోసం నాని మొత్తం  మమ మాస్ లాగా  తయారు అయ్యాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో లాగా నాని గడ్డం తో చింపిరి జుట్టు పాత లుంగీ నలిగిన చొక్కాతోచాలా మాస్ గా  హడావుడి చేస్తున్నాడు. బొగ్గు గనుల నేపధ్యంలో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. సినిమాను ఈ ఏడాది మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

కాని ఇంకా నెల రోజుల టైమ్ మాత్రమే ఉంది ఇప్పటి వరకు పాన్ ఇండియా స్థాయిలో పెద్దగా ప్రమోషన్ చేయడం లేదు. రిలీజ్ మాత్రం గొప్పగా చేస్తున్నాం అని చెప్పారు. కాని ఎక్కడా చడీ చప్పుడు లేకుండా ఉన్నారు. అసలే ఆ మధ్య నాని నెగెటివ్ కామెంట్స్ చేయడం వల్ల చాలా సినిమాలకు డామేజ్ జరిగింది. ఇక ఈ సినిమా కు కూడా సరిగ్గా ప్రచారం చేయడం లేదని నాని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version