టీడీపీ కార్యకర్తలపై మూడేళ్లలో నాలుగు వేల కేసులు: నారా లోకేశ్

సీఎం జగన్‌మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు విసిగి పోయారని, మూడేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు. ఇప్పుడు తాజాగా సామాన్య ప్రజలను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే జగన్ పాలనపై వ్యతిరేకత మొదలైందన్నారు. వైసీపీ పాలకులను తరిమికొట్టే సమయం వచ్చేసిందన్నారు.

నారా లోకేశ్
నారా లోకేశ్

గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో నాలుగు వేల మంది టీడీపీ కార్యకర్తలు, 55 మంది సీనియర్ నాయకులపై కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేశారన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి.. రాజారెడ్డి రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపే ఖాయమన్నారు. ఈ మేరకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఒక్కటవ్వాలన్నారు. పార్టీ బలోపేతానికి ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు.