జగన్ రెడ్డి ఓ దున్న.. మంత్రులంతా కంత్రీలు : నారా లోకేష్

జగన్ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి మూర్ఖపు ముఖ్యమంత్రి, మంత్రులు కంత్రీలు అని మండిపడ్డారు. జగనన్న కాదు జగన్ దున్న అని ఫైర్ అయ్యారు. దున్న ఎం చేస్తుంది? వెంటపడి తరుముతుంది, కుమ్మేస్తుంది, అడ్డుగా ఉన్నవాటిని నాశనం చేస్తుందని అగ్రహించారు నారా లోకేష్. ఎయిడెడ్ విద్యా సంస్థల పై పడ్డాడు. వాటిని విధ్వంసం చెయ్యడానికి ప్రయతిస్తున్నారని.. జగన్ రెడ్డి బ్లడ్ లో డేవలప్మెంట్ లేదు మొత్తం డిస్ట్రక్షనేనని ఎద్దేవా చేశారు.

విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సిన వైసీపీ మంత్రులు ఎం మాట్లాడుతున్నారో విన్నారా? విద్యార్థి సంఘాల ముసుగులో దుండగులు పోలీస్ డ్రెస్ వేసుకొని విద్యార్థుల పై దాడి చేశారటా.? అంటూ మండిపడ్డారు.
ఇంకో మంత్రి అసలు అక్కడ పోలీసులే లేరు విద్యార్థులే కొట్టుకొని తలలు పగలగొట్టుకున్నారని అంటున్నారని ఫైర్ అయ్యారు. ఇలాగే వదిలేస్తే అసలు అనంతపురంలో ఎస్.ఎస్.బి.ఎన్ కాలేజ్ లేదు దాడి ఎప్పుడు జరిగింది అంటారన్నారు.

ఎన్టీఆర్ గారు, వెంకయ్యనాయుడు గారు, జస్టిస్ రమణ గారు, బలయోగి గారు ఆఖరికి జగన్ రెడ్డి తండ్రి వైఎస్ గారు, రోశయ్య గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేసి ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. మొదటి తేదీన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు జీతాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు గారిదని.. రత్నకుమారి కమిటీ ఎవరితో మాట్లాడకుండానే రిపోర్ట్ ఇచ్చిందని వెల్లడించారు. మేనమామగా ఉంటానన్న జగన్ రెడ్డి కంసమామగా మారిపోయారని ఫైర్ అయ్యారు.