కీలక నిర్ణయం తీసుకున్న నాసా.. యూఎఫ్ఓ గుట్టుకోసం ప్రత్యేక టీం

-

అనంత కోటి విశ్వంలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో దాగిఉన్నాయి. అయితే.. భూమిని పోలిన గ్రహాలు ఉండొచ్చని, అక్కడ జీవం ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో ఆశాభావంతో ఉన్నారు. గ్రహాంతర జీవులు మనకంటే అభివృద్ధి చెందినవారని, వారు ఉపయోగించే వాహనాల్లోని టెక్నాలజీ మానవుడి ఊహకు అందని స్థాయిలో ఉంటుందని కొన్ని వాదనలు వినిపిస్తుంటాయి. ఈ వాదనలకు ఊతమిచ్చేలా…. ఆకాశంలో ఫ్లయింగ్ సాసర్ల వంటి గుర్తుతెలియని వస్తువులు (యూఎఫ్ఓ) తిరుగుతుండడాన్ని చూసినట్టు అనేకమంది చెబుతుంటారు. అయితే యూఎఫ్ఓలకు సంబంధించి ఇప్పటిదాకా నిర్దిష్ట ఆధారాలు లేవు.

కొంతమంది వాటిని ఫొటోలు తీశామని చెబుతుండగా, ఆ ఫొటోల స్పష్టత అంతంతమాత్రమే. దాంతో ఈ ఫ్లయింగ్ సాసర్ల అంశం మానవాళికి ఓ మిస్టరీలా మారింది. ఈ నేపథ్యంలో, యూఎఫ్ఓల గుట్టు విప్పేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసింది. ఈ బృందంలో వివిధ శాస్త్ర విభాగాలకు చెందిన 16 మందికి స్థానం కల్పించింది. ఈ బృందానికి డేవిడ్ స్పెర్గెల్ నాయకత్వం వహిస్తారు. యూఎఫ్ఓల ఉనికిపై 9 నెలల పాటు సాగే ఈ అధ్యయనం అక్టోబరు 24న ప్రారంభం కానుంది. ఈ ప్రత్యేక బృందం రూపొందించే నివేదికను వచ్చే ఏడాది బహిర్గతం

Read more RELATED
Recommended to you

Exit mobile version