కేరళ లో నిఫా వైరస్ సోకిన బాలుడు మృతి

-

కేరళలో నిపా వైరస్ ఓ బాలుడిని బలి తీసుకున్నది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు ఆదివారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వైరస్‌ సోకిన బాలుడిని వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా గుండెపోటు రావడంతో కన్నుమూసినట్లుగా సమాచారం. వైరస్‌ సోకిందని గుర్తించిన కొద్ది గంటల్లోనే.. బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతర్జాతీయ నిబంధనల మేరకు బాలుడి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

రాష్ట్రంలో నిపా వైరస్‌ కేసులు వెలుగు చూడడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. బాలుడి హై రిస్క్‌ కాంటాక్టులను ఇప్పటికే గుర్తించి.. వారిని కాపాడేందుకు ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేసిన మోనోక్లోనల్‌ యాంటీబాడీలను ఆర్డర్‌ చేసింది. వైరస్‌ సోకిన బాలుడు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్క్‌ తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌ తర్వాత నమోదైన తొలి నిపా కేసు ఇదే. బాలుడు వైద్యం కోసం మే 12న ఓ ప్రైవేటు క్లినిక్‌కు వచ్చాడు. మే 15న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి మెరుగుకాపోవడంతో బాలుడిని కోజికోడ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాలుడు నిపా వైరస్‌ సోకి మృతి చెందడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version