World Cup 2023 : మరో సంచలనం.. శ్రీలంకపై అఫ్గానిస్థాన్‌ ఘన విజయం

-

AFG vs SL: ప్రపంచకప్‌లో మరో సంచలన విజయం నమోదు అయింది.. శ్రీలంకపై అఫ్గానిస్థాన్‌ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆఫ్గానిస్తాన్ ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ లో వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్ లో పాకిస్తాన్ ను చిత్తు చేసిన ఆఫ్గాన్… ఈసారి లంకను అవలీలగా దాటేసింది.

Afghanistan won by 7 wkts

సోమవారం జరిగిన పోరులో ఆఫ్గాన్ ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. దీంతో ఆడిన 6 మ్యాచుల్లో మూడు విజయాలతో ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆఫ్గాన్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం లక్ష్య చేదనలో ఆఫ్గనిస్తాన్ 45.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఆఫ్గాన్ ఆడిన 17 మ్యాచ్ లో కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసుకోగా…. తాజా టోర్నీలో ముగ్గురు మాజీ ఛాంపియన్లను చిత్తుకింద కొట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version