కరోనా పుట్టింటి నుంచి పెరుగుతున్న మరో వైరస్‌..ఇప్పటికే 35 మందిలో గుర్తింపు..!

-

కరోనా వల్లే సగం సచ్చిబతికాం అంటే..ఆ తర్వాత మంకీపాక్స్‌ కేసులు ఎంట్రీ ఇచ్చాయి. ఇదొక్కటే కాదు కొత్త వ్యాధులు చాలా వస్తున్నాయి. మనకు తెలిసేవి కొన్నే.. కానీ వాటి భారిన పడే వారి సంఖ్య ఏం తక్కువగా లేదు. ఇప్పుడు మళ్లీ జూనోటిక్‌ లాంగ్వా వైరస్‌ అంట.. ఇది కూడా కరోనా ఫ్రెండ్‌లానే ఉంది. ఆ మహమ్మారి పుట్టిల్లు అయిన చైనాలోనే ఈ వైరస్‌ గుర్తించారు. ఏంటీ ఈ వైరస్‌, లక్షణాలు ఎలా ఉంటాయి, వైద్యులు ఏం అంటున్నారో ఒకసారి చూద్దాం..!

తైవాన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చైనాలో జూనోటిక్‌ లాంగ్యా వైరస్‌ వెలుగులోకి వచ్చినట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ వైరస్‌ బారిన 35 మంది పడినట్లు శాస్త్రవేత్తలు అంటున్నారు.. కొత్త వైరస్‌ సంక్రమణను గుర్తించడానికి, పర్యవేక్షించడానికి తైవాన్‌ న్యూక్లియిక్‌ యాసిడ్‌ పరీక్ష పద్ధతిని ప్రారంభిస్తుందని అక్కడి మీడియో కోడైకూస్తోంది.

చైనాలోని షాన్‌డాంట్‌, హెనాన్‌ ప్రావిన్సుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. ఈ వైరస్‌ మనుషులతో పాటు జంతువులకు కూడా సోకుతుందట. వైరస్‌ ఎలా వ్యాపిస్తుందన్న దానిపై ఇప్పటి వరకు ఒక స్పష్టత లేదు కాబట్టి వైరస్‌కు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షలో మేకల్లో 2 శాతం, కుక్కలలో 5 శాతం కేసులు గుర్తించారు. ఈ కొత్త రకం వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారణం ఎలుకను పోలి ఉండే ఒక చిన్న క్షీరదం అని పరిశోధకులు అంటున్నారు.

వ్యాధి లక్షణాలు ఏంటి.?

జ్వరం, అలసట, దగ్గు, ఆకలి లేకపోవడం, కండరాల నొప్పి, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించినట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పటి వరకూ ఈ వైరస్‌ సోకిన 35 మందిలో 26 మందికి ఇవే లక్షణాలు వెలుగుచూశాయట.. అంతేకాకుండా తెల్ల రక్త కణాల తగ్గుదుల కూడా గమనించారు. ప్లేట్‌లెట్స్‌ తగ్గడంతో పాటు లివర్‌, కిడ్నీల పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు రోగుల్లో గుర్తించారు.

ఏది ఏమైనా కాస్త జాగ్రత్తగానే ఉండాలి. అసలే వర్షాకాలం..సీజనల్‌ వ్యాధులతో పాటు ఇలాంటి వైరస్‌ పట్ల కూడా అప్రమత్తంగానే ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news