అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది. ఆలయ గర్భగుడి ఫోటోలను రామ్ మందిర్ ట్రస్ట్ సెక్రెటరీ చంపత్ రాయ్ ఎక్స్(ట్విట్టర్) లో ఫోటోలు పోస్ట్ చేశారు.
प्रभु श्री रामलला का गर्भ गृह स्थान लगभग तैयार है। हाल ही में लाइटिंग-फिटिंग का कार्य भी पूर्ण कर लिया गया है। आपके साथ कुछ छायाचित्र साझा कर रहा हूँ। pic.twitter.com/yX56Z2uCyx
— Champat Rai (@ChampatRaiVHP) December 9, 2023
రామాలయ ప్రారంభోత్సవ వేడుక జనవరి 22, 2024న అంగరంగ వైభవంగా జరుగనుంది. ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామ మంధిరం నిర్మాణం శరవేగంగా జరిగింది. దీంతో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం భారీ సన్నాహాలను చేస్తోంది. వేద మంత్రాల మధ్య కన్నుల పండువగా జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథిగా హాజరు అవుతున్నారు. అంతేకాదు.. ఈ కార్యక్రమానికి దేశంలోని 8వేల మంది ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నారు.