ఇంగ్లీష్​లో ఆంగ్లంలో డిజిటల్‌ సైన్‌బోర్డ్‌ ఏర్పాటుపై నీతీశ్‌ కుమార్ ఫైర్

-

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇంగ్లీష్ భాషపై మరోసారి మండిపడ్డారు. తను ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకుడిని కాదంటూనే.. ఇంగ్లీష్​లో సంతకం పెట్టడం మానేశానని చెప్పారు. అందరికీ అర్థం కావాల్సిన వాటిపై ఇంగ్లీష్​లో రాయడాన్ని నితీశ్‌ కుమార్‌ తప్పుబట్టారు. ఇటీవల ఓ సర్కార్ బడికి వెళ్లిన నితీశ్ అక్కడున్న సైన్​బోర్డుపై ఇంగ్లీష్ పదాలు ఉండటం చూసి మండిపడ్డారు.

బంకా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన నితీశ్ కుమార్.. అక్కడున్న గ్రంథాలయం ముందు ‘డిజిటల్‌ లైబ్రరీ’ అని ఇంగ్లీష్​లో రాసి ఉన్న బోర్డును చూశారు. ఆ బోర్టు హిందీలో ఎందుకు లేదని అక్కడున్న టీచర్లను ప్రశ్నించారు. ‘మనం బ్రిటీష్‌ కాలంలో జీవించడం లేదు కదా’.. అని జిల్లా మేజిస్ట్రేట్ అన్షుల్‌ కుమార్‌పై సీఎం ఫైర్ అయ్యారు.

తాను ఆంగ్ల భాషకు వ్యతిరేకిని కానని. తన చదువంతా ఆ మాధ్యమంలోనే సాగిందని చెప్పారు. పార్లమెంట్‌లో జరిగిన చాలా సమావేశాల్లోనూ తాను ఆంగ్లంలోనే మాట్లాడానని.. కానీ, ఒకనొక సమయంలో తాను మాతృభాషను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అందుకోసం తన సంతకాన్ని కూడా ఇంగ్లిష్‌లో పెట్టడడం మానేశానని.. దయచేసి ఆ బోర్టును త్వరగా మార్చండని అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version