అది అహంకార, అవకాశవాదుల కూటమి: అనురాగ్‌ ఠాకూర్

-

ఇండియా కూటమిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జమిలి ఎన్నికల విధానాన్ని ఇండియా కూటమి నేతలు వ్యతిరేకిస్తుండటంపై ధ్వజమెత్తారు. జమిలి ఎన్నికలను వ్యతిరేకించడం చూస్తుంటే.. ఇండియా కూటమికి ఓ సిద్ధాంతం.. ఓ నాయకుడు గానీ లేనట్టు తెలుస్తోందని అన్నారు. విపక్ష కూటమి అహంకారులు, అవకాశవాదుల కలయిక అని అన్నారు. సనాతన ధర్మానికి హాని కలిగించే లక్ష్యంతో ఆ కూటమి ఉందని ఆరోపించారు.

ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో అనురాగ్‌ ఠాకూర్‌ పాల్గొన్నారు. ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ ద్వారా దేశం సమయం, డబ్బును ఆదా చేయాలని ఇండియా కూటమి కోరుకోవడం లేదని అనురాగ్ అన్నారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు భయపడుతున్నారని తెలిపారు. విపక్ష కూటమి నేతలు నాలుగుసార్లు సమావేశమైనా ఒక నేతను గానీ, కన్వీనర్‌ను గానీ నియమించలేక పోయారంటూ ఎద్దేవా చేశారు.

“విపక్ష కూటమి వేషధారణ మాత్రమే మారింది తప్ప ప్రవర్తన, స్వభావం మాత్రం అలాగే ఉన్నాయి. రాజ్యాంగాన్ని అవమానించేందుకు, ధ్వంసం చేసేందుకు పూనుకొన్న తమిళనాడులోని మీ కూటమి నేతలను చూడండి చిదంబరం గారు.” అని అనురాగ్ ఠాకూర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version