‘నా అధికారాల జోలికి రావొద్దు’..లాయర్​కు సీజేఐ వార్నింగ్

-

సుప్రీం కోర్టులో మంగళవారం రోజున ఓ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. ముందస్తు విచారణకు పట్టుబట్టిన ఓ న్యాయవాదిపై సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అసహనం వ్యక్తంచేశారు. అంతే కాకుండా ‘‘నా అధికారాల జోలికి రావొద్దు’’ అంటూ స్ట్రాంగ వార్నింగ్ ఇచ్చారు.

ఈ నెల 17న సీజేఐ ధర్మాసనం విచారించనున్న పిటిషన్‌పై ముందస్తు విచారణ జరిపించేందుకు ఓ న్యాయవాది ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్‌ను మరో ధర్మాసనం ముందుకు తీసుకెళ్లేందుకు అనుమతినివ్వాలని ఆ లాయర్‌.. సీజేఐను కోరారు. దీంతో జస్టిస్‌ చంద్రచూడ్‌ అసహనానికి లోనయ్యారు.

‘‘మీ కేసు విచారణ 17వ తేదీన లిస్ట్‌ అయి ఉంది. ఇప్పుడు 14వ తేదీ కోసం మరో ధర్మాసనం ముందుకు వెళ్తానని చెబుతున్నారు. నా దగ్గర ఇలాంటి చిట్కాలు పనిచేయవు. మీ కేసు విచారణ 17వ తేదీనే చేపడతాం. అంతే..!’’ అని సీజేఐ స్పష్టం చేశారు. దీంతో ఆ న్యాయవాది సీజేఐకి క్షమాపణలు తెలిపారు. దీనికి జస్టిస్‌ చంద్రచూడ్‌ బదులిస్తూ.. ‘‘మీ క్షమాపణలను అంగీకరిస్తున్నాం. అయితే నా అధికారాలను సవాల్‌ చేసేందుకు ప్రయత్నించకండి. నా అధికారాల జోలికి రావొద్దు’’ అని గట్టిగా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version