కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు భారీ విజయం… గుర్తించిన ఆస్ట్రేలియా

-

దేశీయ తయారీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు భారీ విజయం దక్కింది. ఇన్నాళ్లు భారత్ లో తయారైన కరోనా వ్యాక్సిన్లకు గుర్తించడంలో కొన్ని దేశాలు మోకాలడ్డుతున్నాయి. దీంతో ఈవ్యాక్సిన్లు వేయించుకున్న వారిని తమ దేశాల్లోకి అనుమతించే విషయంలో అనవసర వివాదాలు స్రుష్టిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా దేశం కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ను గుర్తించింది. దీంతో కోవిషీల్డ్ వేయించుకున్న ఆస్ట్రేలియా దేశస్తులతో పాటు ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లాలనుకునే విద్యార్థులు, టూరిస్ట్ లకు ఇక ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. బ్రిటన్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ను కోవిషీల్డ్ పేరుతో సీరం ఇన్సిట్యూట్ దేశీయంగా తయారుచేస్తోంది. ఇప్పటికే పలు యూరోపియన్ యూనియన్ దేశాలు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను గుర్తించాయి. ప్రస్తుతం మరో దేశీయ తయారీ కోవాగ్జిన్ టీకాను అత్యవసర అనుమతులు ఇచ్చే ప్రక్రియను WHO పరశీలిస్తుంది. దీనికి అనుమతులు వస్తే ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు పూర్తిగా తొలిగిపోనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news