BREAKING : ఎల్లుండి నుంచి సుప్రీం కోర్టుకు దీపావళి సెలవులు…బాబుకు షాక్ !

-

BREAKING : సుప్రీం కోర్టుకు దీపావళి సెలవులు వచ్చేశాయి. ఎల్లుండి నుంచి సుప్రీం కోర్టుకు దీపావళి సెలవులు ఉండనున్నాయి. ఏకంగా పది రోజుల పాటూ సుప్రీంకోర్టుకు దీపావళి సెలవులు ఉండనున్నాయి. అయితే.. నేడు సుప్రీంలో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.

Chandrababu Fiber Net case hearing in Supreme Court today

కోర్టు నెంబర్ 6 లో 11వ నెంబర్ గా చంద్రబాబు కేసు లిస్ట్ అయ్యింది. ఈ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసరం విచారించనుంది. మరోవైపు స్కిల్ కేసులో 17Aపై తీర్పు పెండింగ్ లో ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన జడ్జిమెంట్ వెలువడే అవకాశం ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి తరుణంలోనే.. ఎల్లుండి నుంచి సుప్రీం కోర్టుకు దీపావళి సెలవులు ఉండనున్నాయి. ఇవాళ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఆర్డర్ రాకపోతే.. ఇక దీపావళి సెలవుల తర్వాతే అంటున్నారు న్యాయ నిపుణులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version