Lunar Eclipse 2024 : చంద్ర గ్రహణం వేళ చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే..!

-

Lunar Eclipse 2024 : ఈ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన బుధవారం చివరి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. పాక్షిక చంద్రగ్రహణం అని దీన్ని అంటారు. ఈ గ్రహణానికి 9 గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది. అయితే మనం భారతదేశంలో ఈ గ్రహణం కనపడదు కాబట్టి చెల్లదు. గ్రహణకాలంలో కొన్ని నియమాలని పాటించాలి. గ్రహణం వేళ ఎలాంటి తప్పులు చేయకూడదు..? ఎటువంటి వాటిని ఆచరించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. హిందూ పురాణం ప్రకారం చూసినట్లయితే చంద్ర గ్రహణం సమయంలో ధ్యానం చేయడం చాలా మంచిది.

గ్రహణకాలంలో దేవతల విగ్రహాలని పొరపాటున కూడా ముట్టుకోకూడదు. పూజలు శుభకార్యాలు వంటివి చేయకూడదు. అలాగే గ్రహణ సమయంలో చంద్రునికి సంబంధించిన మంత్రాలని పటించాలి. ఎవరి జాతకంలో అయితే చంద్రుడు స్థానం బలహీనంగా ఉంటుందో వాళ్లు కంచు పాత్రలో పాలు పోసి అందులో ముఖం చూసి శివుని గుడికి వెళ్లి ఆ పాలను సమర్పించాలి. చంద్రుని దోషంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చంద్ర దోష నివారణ కోసం చంద్రగ్రహణం నాడు రుద్రాక్ష జపమాలతో చంద్రుని బీజ మంత్రాలని పఠిస్తే మంచిది.

పవిత్రమైన నదిలో స్నానం చేయడం సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయడం మంచిదని శాస్త్రంలో చెప్పబడింది. చంద్రగ్రహణం సమయంలో పూజలు చేయడం శాస్త్రాలపరంగా నిషేధం. ఆలయాల తలుపుల్ని కూడా మూసివేస్తారు. దేవుని విగ్రహాలని కూడా ముట్టుకోకూడదు. గ్రహణ సమయంలో బయటకి వెళ్ళకూడదు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోవడం లేదంటే కుట్టు పని వంటివి చేయకూడదు గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రపరుచుకోవాలి. రాగి పాత్రలు గోధుమలు వంటివి దానం చేయడం మంచిది చక్కటి ఫలితాలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version