ఈసారి ఐపీఎల్ లో ఇబ్బందులు పడుతున్న ముంబైకి మరో భారీ షాక్ తగిలింది. స్టార్ పెసర్ ఆర్చర్ మోచేతి గాయానికి చికిత్స కోసం బెల్జియం వెళ్ళనున్నట్లు THE TELEGRAPH అనే వార్త సంస్థ తెలిపింది. దీనితో అతడు మూడు వారాలపాటు అందుబాటులో ఉండడని పేర్కొంది. ఇప్పటికే బుమ్రా సేవలు కోల్పోయిన ముంబైకి ఆర్చర్ కూడా దూరం కానున్నాడు.
అనుభవజ్ఞుడైన బౌలర్ లేకపోవడంతో ముంబై భారీగా పరుగులు సమర్పించుకుంటుంది. కాగా,గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై 55 పరుగులు తేడాతో పరాజయం పారైంది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన MI బ్యాటర్లు తడబడ్డారు. గుజరాత్ బౌలర్ల దెబ్బకు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. వదేరా 40, గ్రీన్ 33, సూర్యకుమార్ 23 రన్స్ చేయడం మినహా మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.