G-20 సదస్సు.. ఐటీసీ మౌర్యలో బైడెన్.. శాంగ్రీలాలో సునాక్.. మిగతా నేతల బస ఎక్కడంటే..?

-

జీ-20 సమావేశాల్లో పాల్గొనేందుకు అగ్రదేశాధినేతలు బయల్దేరుతున్నారు. వారి కోసం దిల్లీలో ఖరీదైన హోటళ్లు పటిష్ఠ భద్రతతో ముస్తాబయ్యాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్​కు హోటల్ ఐటీసీ మౌర్యలో బైడెన్‌కు వసతి కల్పించారు. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తొలిసారి ప్రధాని హోదాలో భారత్‌కు వస్తున్నారు. ఆయనకు షాంగ్రి లా హోటల్‌లో బస చేసేందుకు వసతి కల్పించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోస్‌, జపాన్‌ ప్రధాని పుమియో కిషిదా.. ది లలిత్ హోటల్‌లో.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ ఇంపీరియల్‌ హోటల్‌లో బస చేస్తారు.

దిల్లీలోని మరో ప్రముఖ హోటల్‌ క్లారిడ్జెస్‌లో ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌ ఉంటారు. డాక్టర్‌ జాకిర్‌ హుస్సేన్‌ మార్గ్‌లో ఉన్న ఒబెరాయ్‌ హోటల్‌ను తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ బస కోసం బుక్‌ చేశారు. గురుగ్రామ్‌ ఒబెరాయ్‌ హోటల్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ ఉంటారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గైర్హాజరవుతున్న వేళ.. ఆ దేశ ప్రతినిధిగా వస్తున్న విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ కూడా ఒబెరాయ్‌లోనే ఉంటారని సమాచారం. చైనా ప్రధాని లీ చియాంగ్ బృందం కోసం తాజ్ హోటల్‌లో వసతి ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version