నేను మోడీ ఏజెంట్‌ని కాదు – గులాంనబీ ఆజాద్

-

నేను మోడీ ఏజెంట్‌ని కాదని కాంగ్రెస్‌ పార్టీ మాజీ నాయకులు గులాంనబీ ఆజాద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి.. అగ్రనేత గులాంనబీ ఆజాద్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోనియాకు లేఖ రాసిన ఆజాద్.. తాను కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు మూడు రోజుల కిందట ప్రకటించారు. అన్ని పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆజాద్ వెల్లడించారు.

అయితే..పార్టీ వీడాక.. ఆయన పై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే.. రాహుల్‌ గాంధీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆజాద్‌. జీ23 లెటర్‌ రాయడమే రాహుల్‌ ఆగ్రహానికి కారణమని.. నేను కాంగ్రెస్‌ను వీడాలని పార్టీ పెద్దలు కోరుకున్నారని మండిపడ్డారు. నేను అవసరం లేదని కాంగ్రెస్‌ అనుకుంది.. అందుకే నేను కాంగ్రెస్‌ పార్టీకి రాజానామా చేశానన్నారు. నేను మోడీ ఏజెంట్‌ని కాదని వెల్లడించారు గులాంనబీ ఆజాద్. పార్లమెంట్‌ లో మోడీని హాగ్ చేసుకుంది.. రాహుల్‌ గాంధీనేనని సెటైర్లు పేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news