ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో డీఏ పెంపు..!

-

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అత్యంత త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచనున్నట్టు తెలుస్తోంది. ఇక ఎంత శాతం పెంచాలి అనే విషయం గురించి ప్రభుత్వం చర్చిస్తున్నట్లు సమాచారం. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచితే, రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు డీఏ పెంచడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు 42 శాతం డీఏ పొంతుతున్నారు.

ఈ నేపథ్యంలో 2023 జూలై నుంచి డిసెంబర్ వరకు ఉద్యోగులకు డీఏ పెంపై కేంద్ర ప్రభుత్వం అధికారక ప్రకటన ఇప్పటి వరకు విడుదల కాలేదు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో చర్చించి, డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక అదే సమయంలో 4 శాతం డీఏ పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డీఏ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version