గుంతకల్లు రైల్వే డీఆర్ఎం వినీత్ సింగ్ అరెస్ట్..!

-

గుంతకల్లు రైల్వే డీఆర్ఎం వినీత్ సింగ్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కడపలో రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కాంట్రాక్టు కోసం కొంతమంది ధర ఖాస్తులు చేసుకున్నారు. అయితే కాంట్రాక్టు ఇప్పించాలంటే డబ్బులు ఇవ్వాలని రైల్వే డీఆర్ఎం వినీత్ సింగ్ డిమాండ్ చేశారు. అయితే ఆయనకు సహకరించిన మరో నలుగురుని సీబీఐ అరెస్ట్ చేసింది. నిందితుడు వినీత్ తో  పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిని సికింద్రాబాద్ సీబీఐ కార్యాలయానికి తరలించారు.

అయితే ఈనెల 04న  గుంతకల్లు డివిజన్ కార్యాలయంలో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు అకౌంట్స్ సెక్షన్ లో అవినీతికి పాల్పడిన అధికారులను పక్కా ఆధారాలతో పట్టుకున్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధి కడవ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు ఆన్ లైన్ టెండర్లు జరిగాయి. ఈ మేరకు కడపకు చెందిన ఓ కాంట్రాక్టర్ ప్రైజ్డ్ బిడ్డర్ అయ్యారు. అయితే ఈ పనులకు ఆక్సెప్టెన్సీ లెటర్ జారీ చేయాలని, ఇందుకు డబ్బులు ఇవ్వాలని డివిజన్ మేనేజర్, ఆఫీస్ సూపరింటెండెంట్లతో పాటు ఇతర సిబ్బంది డిమాండ్ చేశారు. దీంతో సీబీఐ అధికారులను కాంట్రాక్టర్ ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు డీఆర్ఎం వినీత్ సింగ్ తోపాటు మరో నలుగురిని అరెస్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version