ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారత యువత వారానికి 70 గంటల పాటు పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశంలో దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు సరైనవేనని కొంతమంది అంటుంటే.. భారీ సంఖ్యలో మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఇన్ఫీ నారాయణ మూర్తి అభిప్రాయంపై ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా స్పందించారు.
” ఎన్నిగంటలు పనిచేశామన్నదానికంటే.. వ్యక్తిగత ఉత్పాదకత ముఖ్యం. ఇప్పుడు 33 శాతం సమయం ఉద్యోగులు ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు. హైబ్రిడ్ విధానం కార్పొరేట్ రంగంలో ఓ గేమ్ ఛేంజర్. ప్రజెంట్ ట్రెండ్ ఇదే. ఫ్యూచర్ కూడా ఇదే. ఇది అనవసరమైన చాలా ఖర్చులను, ఉద్యోగుల సమయం వృథా కాకుండా నివారిస్తుంది. అవసరాలకు అనుగుణంగా హైబ్రిడ్ పద్ధతిని వినియోగించుకోవాలి. కొత్త మార్పులకు అనుగుణంగా ఉంటూనే.. ఆఫీస్, ఇంటికి మధ్య ఇష్టాలకు టైం కేటాయించుకోవాలి. మీ లైఫ్లో నిజంగా ముఖ్యమైన వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.” అని హర్ష్ గోయెంక తెలిపారు.