మారువేషంలో ప్రజల మధ్యకు వెళ్లిన సీఎం.. ఎవరో తెలుసా..?

-

పూర్వకాలంలో రాజులు తమ గురించి ప్రజుల ఏం అనుకుంటున్నారో తెలుసుకోవడానికో లేదో.. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకో మారువేషంలో ప్రజల మధ్యలోకి వెళ్లారు. అలా మారువేషంలో సామాన్య పౌరులుగా ప్రజలతో మమేకమై వారు తెలుసుకోవాలనుకున్న విషయాలు తెలుసుకనేవారు. లేదా సరదాగా కామన్ మ్యాన్​లా గడపడానికి అలా మారువేషంలో వెళ్లేవారు. తాజాగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అలా అకస్మాత్తుగా కామన్ మ్యాన్ అవతారం ఎత్తారు. ఇంతకీ ఆ సీఎం ఎవరంటే..?

హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మారువేషంలో సాధారణ పౌరుడిలా గడిపారు. ఎవరూ గుర్తు పట్టకుండా.. సెక్యూరిటీ గాడ్స్ తోడు లేకుండా ముఖానికి మాస్క్, తలకు టోపీ పెట్టుకుని ప్రజల మధ్యకు కామన్ మ్యాన్​లా వెళ్లారు. పంచ్​కులాలోని సెక్టార్​-5లోని ఓ గ్రౌండ్​లో జరుగుతున్న మేళాకు మంగళవారం సాయంత్రం సీఎం ఖట్టర్ మారువేషంలో వెళ్లారు. ఓ స్టాల్​లో పాప్​కార్న్ కొనుగోలు చేసి తింటూ ఆ మేళాలో తిరిగారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version