అస్సాంలో భారీ వరదలు.. 6 లక్షల మందికి ఎఫెక్ట్..!

-

అస్సాంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల 10 జిల్లాలలోని సుమారు ఆరు లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమైనట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నదీ జలాల నీటి మట్టం ఉప్పొంగిందని.. దీంతో అనేక ప్రాంతాల్లోని బాధిత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. కొపిలి, బరాక్, కుషియార నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నట్టు వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,01,642 మంది ప్రభావితం కాగా.. గత నెల 28వ తేదీ నుంచి వరదలు, తుఫాన్ కారణంగా పలు ఘటనల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. నాగోన్ జిల్లా అత్యధికంగా ప్రభావితమైనట్టు సమాచారం. పలు జిల్లాల్లోని 40వేల మందికి పైగా నిరాశ్రయులు సహాయక శిబిరాల్లో తలదాచుకున్నట్టు వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. అంతేకాదు.. రైలు, రోడ్డు సేవలకు అంతరాయం కలుగుతోంది. న్యూ హాఫ్లాంగ్ లోని చంద్రనాథ్ పూర్ సెక్షన్ మధ్య ట్రాక్ దెబ్బతినడం, లుమ్ డింగ్ డివిజన్ లోని సిల్చార్ స్టేషన్ లో నీరు నిలిచిపోవడంతో సోమవారం వరకు సుమారు 10 రైళ్లను రద్దు చేసినట్టు ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే ప్రతినిధి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version