hijab row: హిజాబ్ అప్పీళ్ల విచారణకు సుప్రీం అంగీకారం.

-

విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై పలువురు సుప్రీంను ఆశ్రయించారు. అయితే ఈ అంశంపై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషన్ దారులు, వారి తరుపున న్యాయవాదులు కోరగా సుప్రీం కోర్ట్ నిరాకరించింది. అయితే తాాజా కర్ణాటక హైకోర్ట్ తీర్పుపై వచ్చిన అప్పీళ్లను త్వరలోనే విచారణ చేపడుతామని… జాబితాలో చేర్చేందుకు సుప్రీం కోర్ట్ మంగళవారం అంగీకరించింది. విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో దాఖలైన అప్పీళ్ల గురించి సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా మంగళవారం ప్రస్తావించారు. ఇందుకు సీజేఐ ఎన్వీ రమణ రెండు రోజులు ఆగాల్సిందిగా… త్వరలోనే జాబితాలో హిజాబ్ అంశాన్ని చేరుస్తామని చెప్పారు. 

జనవరి నుంచి కర్ణాటకలోని ఉడిాపి, మండ్యా, చిక్ మంగళూర్, శివమొగ తదితర జిల్లాల్లో హిజాబ్ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి విద్యాసంస్థలకు హాజరుకావడాన్ని మరో వర్గం విద్యార్థులు వ్యతిరేఖించారు. కాషాయ కండువాలతో మరోవర్గం విద్యార్థుల హాజరు కావడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ వివాదంపై కర్ణాటక హైకోర్ట్ సంచనల తీర్పు చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ మరియు జస్టిస్ జెఎం ఖాజీలతో కూడిన ధర్మాసనం హిజాబ్ ఇస్లాంలో తప్పనిసరి ఆచారం కాదంటూనే… పాఠశాలల్లో హిజాబ్ నిషేధాన్ని సమర్థించింది. హిజాబ్ నిషేధానికి వ్యతిరేఖంగా వచ్చిన పిటిషన్లను అన్నింటిని కొట్టివేసింది. పాఠశాలలు, కళాశాలల యూనిఫాం నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్న కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థించింది కర్ణాటక హైకోర్ట్.

 

Read more RELATED
Recommended to you

Latest news