వెస్టిండీస్ పై భారత్ వరుసగా 13 వన్డే సిరీస్ లను గెలుచుకుంది. 2007-2023 వరకు జరిగిన వరుస వన్డే సిరీస్ లను టీమిండియానే అందుకుంది. ఇరుజట్లు చివరగా 2019లో మాంచెస్టర్ లో తలపడగా ఆ మ్యాచ్ లో 125 పరుగులు తేడాతో భారత్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది.
కాగా, జింబాబ్వేపై 11, వెస్టిండీస్ పై 10 వరుస వన్డే సిరీస్ లను పాకిస్తాన్ గెలుచుకోగా… శ్రీలంకపై ఇండియా వరుసగా 10 వన్డే సిరీస్ లను గెలుచుకుంది. ఇది ఇలా ఉండగా, వెస్టిండీస్ పై 200 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుంది. భారత్ నిర్దేశించిన 352 పరుగులు భారీ లక్ష్యాన్ని చేదించలేక విండీస్ 35.3 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్ లో గుడాకేష్ (39*), జోసెఫ్ (26), ఆలీక్ అథనాజ్ (32) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో ముఖేష్ 3, శార్దుల్ 4, కుల్దీప్ 2, ఉనద్కత్ 1 చొప్పున వికెట్ తీశారు.