భారత షూటర్ మను బాకర్‌కు అరుదైన గౌరవం

-

పారిస్ ఒలింపిక్స్లో భారత్ షూటర్ మను బాకర్ హ్యాట్రిక్ మిస్ అయిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన 25మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మను 28పాయింట్లతో నాలుగో స్థానానికి పరిమితమైంది. అయితే ఈ ఒలింపిక్స్లో ఇప్పటికే రెండు కాంస్య పతకాలు గెలుచుకుని రికార్డు క్రియేట్ చేసిన మనూకు యావత్ భారతావణి అండగా నిలుస్తోంది. వెల్ డన్ మనూ, హ్యాట్సాఫ్ మను, వీ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ మనూ అంటూ సోషల్ మీడియా వేదికగా మద్దతుగా నిలుస్తోంది.

అయితే మనూ బాకర్కు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. పారిస్‌ ఒలింపిక్స్‌ పోటీల ముగింపు వేడుకల్లో మను బాకర్‌ పతాకధారిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రకటన విడుదల చేసింది. మను బాకర్‌ ఈ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో మరో కాంస్య పతకాన్ని కోల్పోయారు. మరోవైపు పురుష పతాకధారి ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ఆగస్టు 11వ తేదీన ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version