రెండేళ్ల తరువాత ప్రారంభం అయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు

-

కోవిడ్ మహమ్మారి తరువాత దాదాపు రెండేళ్ల విరామం తరువాత రెగ్యులర్ అంతర్జాతీయ విమన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఇన్నాళ్లు కేవలం కొన్ని దేశాలకు మాత్రమే కట్టుదిట్టమైన కరోనా ప్రోటోకాల్స్ ప్రకారమే విమానాలు నడిచాయి. తాజాగా నేటి నుంచి అంతర్జాతీయ విమన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. వేసవి షెడ్యూల్ లో 40 దేశాలకు చెందిన మొత్తం 60 విదేశీ విమాన సంస్థలు 1783 విమాన సర్వీసులను ఇండియా నుంచి రాకపోకలు కొనసాగిస్తాయి. వేసవి షెడ్యూల్ మార్చి 27నుంచి అక్టోబర్ 29 వరకు అమలులో ఉంటుంది.

విమానం

కరోనా కారణంగా మార్చి 23,2020 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేశారు. కేవలం వివిధ దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలతో బయోబబుల్ నియమాల మధ్య విమాన సర్వీసులు నడిచాయి. తాజాగా మార్చి 27 నుంచి తిరిగి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఈమేరకు మార్చి 8న పౌరవిమాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా పాండిమిక్ కారణంగా గత రెండేళ్లుగా విమాన సర్వీసులు నిలిపివేయడంతో ఇటు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news