#WhatsWrongWithIndia హ్యాష్ ట్యాగ్ ట్రెండ్.. భారత్ కు సపోర్ట్ గా నిలిచిన ఇజ్రాయెల్

-

కొద్దిరోజుల క్రితం స్పెయిన్‌కు చెందిన టూరిస్ట్‌పై జార్ఖండ్‌లో సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. దీంతో కొందరు విదేశీయులు భారత్ను నెగెటివ్ కోణంలో ప్రచారం చేస్తూ ‘వాట్స్ రాంగ్ విత్ ఇండియా’ (What’s wrong with India) హ్యాష్ ట్యాగ్ను నెట్టింట ట్రెండ్ చేస్తోంది. అయితే ఈ ట్రెండ్కు చాలా మంది పాజిటివ్ కౌంటర్ ఇస్తున్నారు. భారత్ సాధించిన విజయాలు, పురోగతిని  భారతీయులు ప్రస్తావిస్తున్నారు. వీరికి తాజాగా భారత్‌లోని ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం తోడైంది.

ఈ హ్యాష్‌ట్యాగ్ గురించి ఇజ్రాయెల్‌ రాయబారి నవోర్‌ గిలాన్‌, ఇతర సిబ్బందిని ఓ వ్యక్తి ప్రశ్నించిన వీడియోను షేర్ చేసింది. దౌత్యసిబ్బంది మాట్లాడుతూ మనదేశ విజయాలు, సంస్కృతులు, ఆహారం వంటివాటి గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ‘మీ ల్యాండర్ జాబిల్లిపై దిగ్విజయంగా కాలుమోపింది.. పర్యటించేందుకు ఎన్నో అందమైన ప్రదేశాలున్నాయి.. జిలేబీ లాంటి నోరూరించే పదార్థాలు, వినేందుకు మధురమైన పాటలు ఉన్నాయి.. చూడాల్సిన సినిమాలు ఎన్నెన్నో’ అంటూ ఒక్కొక్కరు తమకు నచ్చినవాటి గురించి వెల్లడించారు. ఆ వీడియో చివర్లో భారత్‌లో అంతా బాగుంది అనే అర్థం వచ్చేలా IsraellovesIndia అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version